
రాజకీయాలు

జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో తొలి రోజే భారత షూటర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం మూడు పతకాలు సాధిస్తూ భారత్‌కు శుభారంభం అందించారు. నిన్న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో శివ నర్వాల్ స్వర్ణ పతకం గెలిచి మెరిశాడు. అదే విభాగంలో చిరాగ్ శర్మ కాంస్య పతకాన్ని అందుకొని మరో విజయాన్ని జోడించాడు.
ఇక మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పనా భుగ్రా రజత పతకాన్ని సాధించింది. తొలి రోజే భారత జట్టు మూడు పతకాలతో సత్తా చాటడంతో టోర్నీలో మరిన్ని విజయాలపై ఆశలు పెరిగాయి.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!