
క్రీడలు

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని సీతపాలెం ప్రత్యేక ఆర్థిక మండలిలో ప్రముఖ ఔషధ సంస్థ బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ యూనిట్‌కు విద్య, సమాచార సాంకేతిక శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. మంత్రి రాక సందర్భంగా సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం భూమిపూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ పరిశ్రమ ఫార్మాస్యూటికల్ మధ్యవర్తి ఉత్పత్తులు మరియు ఒప్పంద అభివృద్ధి తయారీ కేంద్రంగా ఏర్పాటుకానుంది. మొత్తం రూ.2,300 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో నిర్మాణం చేపట్టనున్నారు. ఈ యూనిట్ ద్వారా సుమారు 1,750 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ప్రత్యేక ఔషధ, ఆరోగ్య సంరక్షణ రంగంలో గుర్తింపు పొందిన ఈ సంస్థకు ప్రభుత్వం 102.48 ఎకరాల భూమిని కేటాయించింది.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!