

మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి మావిగన్ విధానమే సరైన మార్గమని పేర్కొన్నారు. రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి వంటి మెగా ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేయడం వల్ల రాష్ట్ర వనరులు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమవుతాయని, ఇతర ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకబడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను అనుసంధానిస్తూ మావిగన్ మోడల్‌ను ప్రతిపాదించిన జగన్, దీని ద్వారా కేవలం పది వేల కోట్లతోనే రాజధాని ఏర్పాటుచేయవచ్చని తెలిపారు. మిగిలిన నిధులను రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు, ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధికి వినియోగించవచ్చని చెప్పారు. ఈ విధానం ద్వారా రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని ప్రాంతాల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన పేర్కొన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!