

టెక్ దిగ్గజం మెటా లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంటోంది. సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కు ప్రత్యామ్నాయంగా పనిచేసేలా ఫొటోరియలిస్టిక్, 3డీ ఏఐ క్యారక్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జుకర్‌బర్గ్ హావభావాలు, గొంతు, కమ్యూనికేషన్ శైలిని అనుకరించే ఈ డిజిటల్ ట్విన్ ద్వారా సంస్థలో రియల్ టైమ్ కమ్యూనికేషన్ మరింత సులభం చేయాలనే లక్ష్యంతో మెటా ముందుకు సాగుతోంది.
ఈ ఏఐ వర్షన్‌కు స్వయంగా జుకర్‌బర్గ్ శిక్షణ ఇస్తున్నారని, వారానికి కొన్ని గంటలు దీనిపై పనిచేస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాక “సీఈఓ ఏజెంట్” ప్రాజెక్ట్ ద్వారా వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇదే సమయంలో ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి సంస్థలతో పోటీలో ముందుండేందుకు మెటా భారీగా ఏఐలో పెట్టుబడులు పెడుతోంది. అయితే ఈ మార్పులతో ఉద్యోగ భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొన్నది.


















.webp&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!