

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా సంజీవ్ ఖన్నా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన కంపెనీలో రిఫైనరీస్ డైరెక్టర్గా పనిచేశారు. జి. కృష్ణకుమార్ పదవీకాలం 2025 ఏప్రిల్ 30తో ముగియడంతో అప్పటి నుంచి ఖన్నా అదనపు సీఎండీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. పెట్రోలియం శాఖ నుంచి అధికారిక సమాచారం వచ్చిన తరువాత ఆయన ఏప్రిల్ 9 నుంచి పూర్తిస్థాయి సీఎండీగా బాధ్యతలు చేపట్టినట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది.
సంజీవ్ ఖన్నా 2029 మే 31 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన తిరుచిరాపల్లి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేయగా, ముంబై యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. బీపీసీఎల్ అభివృద్ధికి ఆయన నాయకత్వం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!