

చంద్రబాబు ప్రభుత్వంపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ హక్కుల సాధన లక్ష్యంగా భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నాలుగో రోజుకు చేరింది. ఈ నెల 11న మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రారంభమైన ఈ దీక్షకు పలు బీసీ సంఘాలు మద్దతు ప్రకటించాయి. తొలి రోజున జ్యోతిరావు ఫూలే, బీపీ మండల్ వారసులు హాజరై మద్దతు తెలిపగా, రెండో రోజున మరికొన్ని బీసీ సంఘాలు మరియు రాజకీయ నేతలు కూడా సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా ఇప్పటికే మద్దతు ప్రకటించగా, వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ దీక్షకు మద్దతు తెలిపారు.
అయితే బోడే రామచంద్ర యాదవ్ దీక్ష నాలుగో రోజుకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. పలు చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. దీక్ష కొనసాగుతున్న కొద్దీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తుండటంతో బీసీ సంఘాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ దీక్ష వ్యక్తిగతం కాదని, బీసీల అభ్యున్నతికోసమేనని నేతలు పేర్కొంటున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీక్ష స్థలికి వివిధ పార్టీల నాయకులు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఆయన డిమాండ్లు న్యాయసమ్మతమైనవని, వాటి అమలు పెద్ద సమస్య కాదని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీసీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తన ఐదు ప్రధాన డిమాండ్లను అంగీకరించేవరకు దీక్ష విరమించబోనని బోడే రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.
బీసీ హక్కుల సాధన కోసం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా పలు కీలక డిమాండ్లను బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. బీసీ రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని ఆయన ప్రధానంగా కోరుతున్నారు. అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీలకు వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాలని, విద్యా, ఉద్యోగాలు మరియు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బోడే రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ, బీసీలకు న్యాయం జరిగేలా తాను కోరుతున్న ఈ ఐదు అంశాలను ప్రభుత్వం అంగీకరించేవరకు తన ఆమరణ నిరాహార దీక్షను విరమించబోనని స్పష్టం చేశారు.
.jpeg)




.jpeg&w=3840&q=75)






.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!