
న్యూస్

ఇరాన్ యుద్ధ సంక్షోభం సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం లేకపోతే భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ వ్యాఖ్యానించారు. గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని మోదీ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని ఆయన తెలిపారు.
గల్ఫ్ దేశాలతో భారత్ సంబంధాలు గత ప్రభుత్వాల కంటే ప్రస్తుతం బలోపేతమయ్యాయని జైశంకర్ పేర్కొన్నారు. యుద్ధ పరిస్థితుల కారణంగా విమాన రవాణా, సరఫరా శృంఖలపై ప్రభావం పడిందని, అయితే భారత పౌరుల భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి గల్ఫ్ దేశాలతో కలిసి పనిచేస్తున్నామని ఆయన వెల్లడించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!