
న్యూస్

సీపీఐ నారాయణ భారత విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్, యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులపై మౌనం పాటించడం బాధాకరం మాత్రమే కాక సిగ్గుచేటు విషయమని అన్నారు. అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా భారత్ స్పందించకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి ముందుకు వస్తుండగా భారత్ మౌనం పాటించడం ఆశ్చర్యకరమని నారాయణ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ కాలంలో భారత్కు ఉన్న గౌరవం ఇప్పుడు కనిపించడం లేదని, ఇది నాయకత్వ వైఫల్యానికి సంకేతమని విమర్శించారు.








.jpeg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!