.jpg&w=3840&q=75)

దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించి ఒక సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారణాసి బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన కథ లీక్ అయిందని టాక్. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఉండగా, ఇందులో మహేష్ బాబు పరమ శివభక్తుడిగా కనిపిస్తారని సమాచారం. విశ్వాన్ని ప్రభావితం చేసే ఒక శక్తివంతమైన కళాఖండం కోసం ఆయన కాలయానం చేస్తారని చెబుతున్నారు.
ఈ ప్రయాణంలో శతాబ్దాల ప్రాచీన రహస్యాలను ఛేదిస్తూ వెళ్లే హీరో, చివరికి పృథ్వీరాజ్ సుకుమారన్ పోషిస్తున్న విలన్‌ను ఎదుర్కొంటాడట. ఆ కళాఖండాన్ని స్వాధీనం చేసుకుని ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలనుకునే విలన్‌ను అడ్డుకుని విశ్వాన్ని కాపాడటం కథ సారాంశంగా చెబుతున్నారు. ఈ స్టోరీపై అధికారిక ధృవీకరణ లేకపోయినా అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. భారీ బడ్జెట్‌తో ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!