
సినిమాలు

ఎన్. చంద్రబాబు నాయుడు అగ్నిమాపక విపత్తు నిర్వహణ శాఖను దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దాలని తెలిపారు. అమరావతి లో జరిగిన కార్యక్రమంలో కొత్త అగ్నిమాపక వాహనాలు, పరికరాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. రూ.252.93 కోట్లతో శాఖ ఆధునీకరణ చేపట్టగా, తొలి దశలో రూ.33.25 కోట్ల విలువైన వాహనాలు, పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ దశలో 25 అధునాతన అగ్నిమాపక వాహనాలు, 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 50 రబ్బర్ పడవలు, 30 శ్వాస యంత్ర పరికరాలు కొనుగోలు చేశారు. కేంద్ర నిధులను సమర్థంగా వినియోగించిన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రజల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నగరాల్లో ఎత్తైన భవనాలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్నిమాపక శాఖ మరింత ఆధునికంగా తయారవ్వాలని తెలిపారు.


.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!