

రాకాస చిత్రాన్ని ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరను రూ.100గా నిర్ణయించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మించిన ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది.
చక్కటి కామెడీ, వినోదభరిత కథతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సంగీత్, గెటప్ శ్రీను ట్రాక్‌కు మంచి స్పందన లభిస్తుండగా, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌కు విశేష ప్రశంసలు వస్తున్నాయి. టికెట్ ధర తగ్గించడంతో కుటుంబ ప్రేక్షకులు మరింతగా థియేటర్లకు వచ్చే అవకాశముంది. నిర్మాతగా ‘కమిటీ కుర్రోళ్లు’ తర్వాత మరో విజయాన్ని అందుకున్న నిహారిక కొణిదెలకు ఇది మరో మైలురాయిగా నిలిచింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!