
న్యూస్

విజయ్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘జన నాయగన్’ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే పైరసీ బారిన పడటంతో సినీ పరిశ్రమలో ఆందోళన నెలకొంది. గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమా అనూహ్యంగా హెచ్‌డీ ప్రింట్ల రూపంలో ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో మేకర్స్‌తో పాటు అభిమానులు షాక్‌కు గురయ్యారు.
ఈ ఘటనపై హీరోయిన్ పూజా హెగ్డే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందిస్తూ, ఒక సినిమా అనేది ఎంతో మంది శ్రమ, త్యాగాల ఫలితమని, ఇలా లీక్ కావడం చాలా బాధాకరమని తెలిపారు. ప్రేక్షకులు పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాను చూసి మద్దతు ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!