

ఎలివేటెడ్ కారిడార్లు, ఆధునిక మౌలిక సదుపాయాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా మారుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసన మండలిలో మాట్లాడుతూ, ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు CURE, PURE, RARE విధానాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఆదాయం పెరగడంతో వాహనాల సంఖ్య పెరిగిందని, అందుకే మెట్రో, ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టామని వివరించారు.
శామీర్‌పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించడంతో పాటు ఓఆర్‌ఆర్ లోపల రేడియల్ రోడ్లు ఏర్పాటు చేసి ప్రయాణ సమయాన్ని తగ్గించనున్నట్లు తెలిపారు. కాలుష్య పరిశ్రమలను ఓఆర్‌ఆర్ బయటకు తరలిస్తూ, రద్దీ ప్రాంతాల్లో మల్టీ లెవల్ పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రూ.15,000 కోట్లతో మెట్రోను స్వాధీనం చేసుకుని 76 కి.మీ మేర విస్తరించనున్నట్లు వెల్లడించారు. ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఢిల్లీలా కాలుష్యం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో సేవలు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు.








.avif&w=3840&q=75)






.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!