

టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘బైకర్’ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా తన కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండగా, రేసింగ్ సీన్స్, ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శర్వానంద్ రేసర్‌గా కొత్త లుక్‌లో కనిపిస్తూ మంచి ఇంప్రెషన్ ఇస్తున్నాడు.
ఈ ట్రైలర్‌పై ప్రభాస్ స్పందిస్తూ “వైబ్ అదిరిపోయింది” అని ప్రశంసించారు. సినిమా టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 3 న విడుదల కానుంది. ఈ మూవీ శర్వానంద్ కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచే అవకాశం ఉంది.
.webp&w=3840&q=75)














.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!