

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెటర్లతో కళకళలాడే ఐపీఎల్ 2026 సీజన్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లతో సన్నద్ధమవుతున్నాయి. తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను విడుదల చేయగా, మార్చి 28న సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా వీకెండ్‌లలో ఫ్యాన్ పార్కులను బీసీసీఐ ఏర్పాటు చేస్తోంది.
ప్రతి ఫ్యాన్ పార్కులో లైవ్ మ్యాచ్ స్క్రీనింగ్‌తో పాటు సంగీతం, వినోద కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, చిన్నారుల ఆటల జోన్‌లు, వర్చువల్ బ్యాటింగ్, బౌలింగ్ నెట్స్, ఫేస్ పెయింటింగ్, ఫోటో బూత్స్ వంటి ఆకర్షణలు ఉంటాయి. 2015లో ప్రారంభమైన ఈ ఫ్యాన్ పార్క్ కాన్సెప్ట్ అభిమానులకు స్టేడియం అనుభూతిని అందిస్తోంది. మూడు వారాంతాల్లో రోహ్‌తక్, భోపాల్, నాగ్‌పూర్, తుమకూరు, కృష్ణానగర్, మథుర, జోధ్‌పూర్, మైసూరు, భువనేశ్వర్, నిజామాబాద్, మీరట్, నడియాద్, రత్నగిరి, కోయంబత్తూర్, రౌర్కెలా వంటి నగరాల్లో ఇవి ఏర్పాటు చేయనున్నారు.





.jpeg&w=3840&q=75)















.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!