
సినిమాలు

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని పార్లమెంట్ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశం సందర్భంగా పలు ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
ఈ సందర్భంగా ఎంపీలు మల్లు రవి, వేమ్ నరేందర్ రెడ్డి, సురేష్ షెట్కర్, రఘురాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!