

తెలంగాణ ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్ల వార్షిక బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో రూ.2,34,406 కోట్లు రెవెన్యూ వ్యయంగా, రూ.47,267 కోట్లు మూలధన వ్యయంగా కేటాయించారు. వ్యవసాయం, విద్యుత్, విద్య, ఆరోగ్య రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించగా, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, రోడ్లు & భవనాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు.
ఈ బడ్జెట్‌లో పలు సంక్షేమ పథకాలు కూడా ప్రకటించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ప్రారంభించి, 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించనున్నారు. చేయూత పథకంలో 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమానికి భారీ నిధులు కేటాయించారు. అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.2,000 స్టైపెండ్ ఇవ్వాలని, గురుకుల హాస్టళ్ల మరమ్మతులకు నిధులు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
















.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!