

ప్రస్తుత ఎల్పీజీ సరఫరా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాలని, ముఖ్యంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) మరియు విద్యుత్ పరికరాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈరోజు అమరావతిలో అధికారులు సమావేశంలో ఆయన రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ పీఎన్జీ కనెక్షన్లు అందించాలన్నారు. ప్రస్తుతానికి 2.34 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఉన్నప్పటికీ, 60,000 మాత్రమే వినియోగంలో ఉన్నాయి. దీనిని 100% వినియోగంలోకి తీసుకురావాలని, ప్రతి జిల్లాకు కనీసం 10,000 కొత్త కనెక్షన్లు ఇవ్వాలని సీఎం సూచించారు.
అతను శ్రీకాకుళం–కాకినాడ పైప్‌లైన్ పునరుద్ధరణ కోసం కేంద్రానికి లేఖ రాయాలని, ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు తక్షణ ఉత్తర్వులు ఇవ్వమని అధికారులను ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో ‘నేచురల్ గ్యాస్ పాలసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్’ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. విద్యుత్ పరికరాలను ప్రత్యామ్నాయంగా వినియోగిస్తూ గ్యాస్ సంక్షోభాన్ని విద్యుత్ రంగానికి అవకాశం చేసుకోవాలని, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అంగన్వాడీలు, కాంటిన్లు, హోటళ్లు మొదలైన వాటికి ఎల్పీజీ సిలిండర్ల ప్రాధాన్యతా పంపిణీ జరిగేలా చూడమని అన్నారు. పంట నష్టాలను కూడా పరిశీలించి, ఈ నెల 26 కల్లా పూర్తి నివేదిక సమర్పించమని ఆదేశించారు.





















.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!