
న్యూస్

హైదరాబాద్‌లోని నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన కుమార్తెలు ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కారు అతివేగంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద కుమార్తె అక్షర తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని సమాచారం, కాగా రెండో కుమార్తె దిశర స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
గాయపడిన వారిని వెంటనే గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక విచారణలో అతివేగమే ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంలో మరోసారి విషాదం నెలకొంది.





















.avif&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!