
న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు కఠిన హెచ్చరిక జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని 48 గంటల్లోగా తెరవాలని ఆదేశించారు. లేదంటే ఇరాన్‌లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా వెల్లడించారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముంది. హర్మూజ్ మార్గం ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైనదిగా భావించబడుతోంది.
















.jpg&w=3840&q=75)





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!