

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ భారీ అంచనాల నడుమ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవర్ స్టార్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో విడుదలకు ముందే భారీ హైప్ నెలకొంది. తెల్లవారుజామున షోలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. కథ, కథనం రొటీన్‌గా ఉండటంతో కొంతమంది ప్రేక్షకులకు నిరాశ కలిగించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద తొలి రోజే ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. అంతేకాకుండా అదే సమయంలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ధురంధర్ 2’ ప్రభావం కూడా వసూళ్లపై కనిపించినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు సుమారు రూ. 48 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఆన్‌లైన్ డేటా ప్రకారం భారత్ వ్యాప్తంగా 5,359 షోల ద్వారా రూ. 31.86 కోట్లు రాబట్టింది. మొత్తం ఆక్యుపెన్సీ 68.01%గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ స్టార్ పవర్ కారణంగా వసూళ్లు స్థిరంగా నమోదయ్యాయి. ఇక్కడ రూ. 19.40 కోట్లు వసూలు కాగా, ఆక్యుపెన్సీ 68.35%గా ఉంది.
అయితే తెలంగాణలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. ఇక్కడ కేవలం రూ. 9.10 కోట్లు మాత్రమే రాబట్టింది. దీనికి ప్రధాన కారణంగా ‘ధురంధర్ 2’ హిందీ సినిమాకు వచ్చిన భారీ స్పందనను ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లోనూ భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ప్రభావం చూపలేకపోయింది. మొత్తం మీద తొలి రోజు ప్రదర్శన అండర్‌వెల్మింగ్‌గా మిగిలిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!