
న్యూస్

ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో, తన ప్రఖ్యాత మిడ్‌సైజ్ ఎస్యూవీ డస్టర్‌ను సరికొత్త డిజైన్ మరియు ఫీచర్లతో మళ్లీ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఢిల్లీలో ఈ కారు ప్రారంభ ధర రూ.10.49 లక్షలుగా నిర్ణయించారు. ప్రస్తుతం కంపెనీ పోర్టుఫోలియోలో క్విడ్, ట్రైబర్, కైగర్ మోడళ్లు ఉన్నాయి.
కొత్త డస్టర్, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుండాయ్ క్రెటా, టాటా సియెర్రా వంటి కార్లకు గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా వేస్తున్నారు. ఈ కారు తయారీలో 90 శాతం కంటే ఎక్కువగా స్థానికంగా తయారైన విడిభాగాలను ఉపయోగించినట్లు కంపెనీ వెల్లడించింది.
అదేవిధంగా, ఈ కారు ఆరు గేర్లతో కూడిన ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది.











.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!