
సినిమాలు

హర్మూజ్ జలసంధి విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి అల్టిమేటం జారీ చేశారు. 48 గంటల గడువు ఇచ్చి ఎలాంటి బెదిరింపులు లేకుండా జలసంధిని తిరిగి తెరవాలని సూచించారు. ఈ రోజు సాయంత్రంతో ఈ గడువు ముగియనుండటంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ గడువులోగా చర్యలు తీసుకోకపోతే ఇరాన్ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో హర్మూజ్ జలసంధి కీలకంగా మారింది. ఈ మార్గం మూసివేతతో ప్రపంచ వాణిజ్యం మరియు ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!