
సినిమాలు

డొమెస్టిక్ విమాన టికెట్ ధరలపై 2025 డిసెంబర్‌లో విధించిన పరిమితులను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఎయిర్‌లైన్స్ తమకు అనుకూలంగా టికెట్ ధరలను నిర్ణయించే స్వేచ్ఛ పొందాయి. ఈ కొత్త ధరల విధానం రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఇంధన ధరలు, డిమాండ్ మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులు విమాన ఛార్జీల పెంపును ఎదుర్కోవాల్సి రావచ్చు. డిమాండ్, సరఫరా ఆధారంగా ధరలు మారే అవకాశం ఉంది. అయినప్పటికీ, అధికంగా లేదా అనవసరంగా ధరలు పెంచవద్దని కేంద్రం ఎయిర్‌లైన్స్‌ను హెచ్చరించింది. ప్రయాణికుల ప్రయోజనాలను కాపాడేందుకు ధరలపై పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!