
న్యూస్

కథా బలం ఉన్న చిత్రాలకు ప్రత్యేకంగా పెద్ద ప్రచారం అవసరం లేదని, అలాంటి సినిమాలను ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. కోనా వెంకట్ సమర్పణలో రోషన్ మరియు శ్రీదేవి జంటగా నటించిన ‘బ్యాండ్‌మేళం’ చిత్ర ట్రైలర్‌ను ఆయన విడుదల చేశారు. ట్రైలర్‌లోని సంభాషణలు తనకు ఎంతో నచ్చాయని చిరంజీవి అభినందించారు.
ఈ సందర్భంగా నటీనటులతో సరదాగా మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా వారి డ్యాన్స్‌లను తాను తరచూ చూస్తుంటానని పేర్కొన్నారు. ఈ నెల 26న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!