
న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేస్తున్న కఠిన వలస విధానాల ప్రభావం భారత్, చైనా దేశాలపై ఎక్కువగా పడుతున్నట్లు వాషింగ్టన్ పోస్టు కథనం వెల్లడించింది. 2024 తొలి ఎనిమిది నెలలతో పోలిస్తే 2025లో అదే కాలంలో సుమారు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయని పేర్కొంది.
అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2025 జనవరి నుంచి ఆగస్టు వరకు శాశ్వత, తాత్కాలిక వీసాల మంజూరు 11 శాతం తగ్గింది. ఈ వీసాలు విద్యార్థులు, ఉద్యోగార్థులు, చట్టబద్ధ నివాసితుల కుటుంబ సభ్యులకు జారీ చేయబడతాయి. ట్రంప్ “అమెరికా ఫస్ట్” విధానంతో జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ విదేశీయులపై కఠిన పరిశీలన కొనసాగిస్తున్నారని అధికారులు తెలిపారు.












.avif&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!