
గాసిప్స్

ప్రపంచ సినీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు ఈసారి టీవీ ప్రేక్షకాదరణ తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి. వాల్ట్ డిస్నీ సంస్థ విడుదల చేసిన వివరాల ప్రకారం, గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతూ వచ్చిన రేటింగ్స్ ఈ ఏడాది తగ్గుముఖం పట్టాయి. కోనన్ ఓ’బ్రియన్ హోస్ట్‌గా వ్యవహరించిన 98వ ఆస్కార్ వేడుక ఈసారి తక్కువ ప్రేక్షకులను ఆకర్షించింది.
గత ఆదివారం నిర్వహించిన ఈ వేడుకను ఏబీసీ టీవీ ఛానల్ మరియు హులు ఓటీటీ వేదికల ద్వారా కలిపి సుమారు 17.9 మిలియన్ల మంది వీక్షించారు. గత ఏడాది 19.7 మిలియన్లతో పోలిస్తే ఇది దాదాపు 9 శాతం తగ్గుదల. ముఖ్యంగా 18 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ప్రేక్షకుల్లో సుమారు 14 శాతం తగ్గుదల కనిపించడం మొత్తం వ్యూయర్షిప్ తగ్గడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
.webp&w=3840&q=75)





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!