
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విజయవాడలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో అనేక హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది హోటల్ యజమానులు కట్టెల పొయ్యిలపై వంటలు చేస్తూ వ్యాపారాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే స్టార్టర్స్ వంటి వంటకాలను కట్టెలపై తయారు చేయడం కష్టమని, దీంతో ఆర్థికంగా నష్టపోతున్నామని వారు చెబుతున్నారు.
ఇక రెండో సిలిండర్ సరఫరా ఉంటుందో లేదో అన్న అనిశ్చితి కారణంగా నగరంలోని పలు గ్యాస్ ఏజెన్సీల వద్ద వినియోగదారులు బారులు తీరుతున్నారు. గ్యాస్ బుకింగ్ కోసం ప్రజలు ముందుగానే క్యూల్లో నిలబడుతుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోంది. వంట గ్యాస్‌పై ఆధారపడిన కుటుంబాలు, హోటల్ వ్యాపారాలు ఈ సంక్షోభం ప్రభావాన్ని తీవ్రంగా అనుభవిస్తున్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!