
.jpg&w=3840&q=75)
ఇటీవల టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పలువురు నటీనటులు వరుసగా పెళ్లి చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నటి సంయుక్త మీనన్ కూడా త్వరలో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ సినీ పరిశ్రమ నుంచి తెలుగు చిత్రాలలోకి అడుగుపెట్టి వరుస విజయాలతో మంచి పేరు సంపాదించింది సంయుక్త. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, తరువాత వచ్చిన బింబిసార, సార్, అఖండ వంటి సినిమాలతో విజయాలను అందుకుంది.
ప్రస్తుతం సంయుక్త మీనన్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో అనేక సినిమాలతో బిజీగా ఉంది. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న స్వయంభూ, అలాగే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. మరోవైపు రామ్ చరణ్ సినిమాలో ప్రత్యేక గీతంలో నటించే అవకాశం కూడా ఆమెకు వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కెరీర్ పరంగా మంచి స్థాయిలో ఉన్న ఆమె తన పాత్రలను జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉండగా, సంయుక్త మీనన్ వ్యక్తిగత జీవితంపై మరోసారి చర్చ మొదలైంది. ఆమె ఒక వ్యక్తితో చాలా కాలంగా సంబంధంలో ఉందని, అతనితో త్వరలోనే పెళ్లి పీటలెక్కాలని నిర్ణయించుకుందని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఆమె ఖండించింది. అయినప్పటికీ ఈసారి వస్తున్న వార్తలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. పెళ్లి తర్వాత కూడా నటన కొనసాగించే అవకాశముందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలుసుకోవాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!