

మిహీకా బజాజ్ వివాహానికి ముందే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రియేటివ్ ఆంత్రప్రెన్యూర్. ‘డ్యూడ్రాప్ డిజైన్ స్టూడియో’తో ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రారంభించి, తర్వాత ‘బొహైమ్ స్టూడియో’ ద్వారా ఇంటీరియర్ డిజైనింగ్‌లో అడుగుపెట్టారు. కళలపై ఉన్న ఆసక్తితో ‘ఆర్ట్కనెక్ట్’ పేరుతో పెయింటింగ్ ప్రదర్శనలు నిర్వహిస్తూ కళాకారులకు వేదిక కల్పిస్తున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ‘ముదిత ట్రైబ్ క్లబ్’ల ద్వారా మహిళలు, పురుషులు ఇద్దరికీ సహాయపడే కార్యక్రమాలు చేపడుతున్నారు.
తన వ్యక్తిత్వానికి మూలం తన పెంపకమేనని మిహీకా చెబుతున్నారు. తన తల్లి బంటీ బజాజ్ నేర్పిన విలువలు జీవితాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. లండన్‌లోని చెల్సియా యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ నుంచి మాస్టర్స్ పూర్తి చేసి తన వ్యాపారాన్ని నిర్మించారు. డిజైన్ అనేది కేవలం అందం కాదు, ఆ స్థలానికి ఆత్మను ఇవ్వడమని ఆమె అభిప్రాయం. వివాహానంతరం నటుడు రానా దగ్గుబాటి కుటుంబం నుంచి లభిస్తున్న ప్రోత్సాహం తనకు బలం అని చెప్పారు. కుటుంబమే తనకు మొదటి ప్రాధాన్యమని చెబుతూ, వారి మద్దతుతో మరిన్ని సృజనాత్మక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!