
న్యూస్

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు సృష్టించడంతో పాటు మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేశారని ఆరోపించారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశించిన దేశ మహిళల ఆశలను నిరాశపరిచారని అన్నారు.
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన “మహిళా ఆక్రోశ్ పాదయాత్ర”లో మాట్లాడిన బండి సంజయ్, కాంగ్రెస్ కూటమి నాయకులపై కూడా విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముందడుగు వేసారని, రాబోయే ఎన్నికలకల్లా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!