

రాష్ట్రంలో ఇంధన కొరత సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టర్లు, పోలీసులు, ఉన్నతాధికారులు మరియు పెట్రోలియం సంస్థల ప్రతినిధులతో కలిసి పరిస్థితిని సమీక్షించారు. నిన్న రాత్రి నుంచి తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ రోజు సాయంత్రానికి ఎక్కువ ప్రాంతాల్లో పరిస్థితి సాధారణ స్థితికి చేరుకునే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా జరిగేందుకు అధికారులు మరియు ఆయిల్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఉదయం పంపిన ఆయిల్ ట్యాంకర్లు ఈ రోజు సాయంత్రం వరకు పెట్రోల్ బంకులకు చేరుకునేలా చూడాలని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా కలెక్టర్లు, పోలీసులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
ఆర్టీజీ కేంద్రం ద్వారా ప్రతి మూడు గంటలకు ఒకసారి పరిస్థితిని పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. మీడియా మరియు క్షేత్ర స్థాయి సమాచారం ఆధారంగా అధికారులు వెంటనే స్పందించాలని సూచించారు. ఎవరైనా బ్లాక్ మార్కెట్ లేదా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఆయిల్ సంస్థలు నిరంతరం పని చేయాలని ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!