

ఈ సంవత్సరం సంక్రాంతికి 'నారీ నారీ నడుమ మురారి' సినిమాతో విజయాన్ని అందుకున్న శర్వానంద్ తాజాగా బైకర్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బైక్ రేసింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి సాధారణ స్పందన పొందినా, థియేటర్లలో మాత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ఇప్పుడు విడుదలైన కొద్దికాలంలోనే ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది.
ఈ సినిమాలో శర్వానంద్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలు పోషించగా, రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించారు. దర్శకుడు అభిలాష్ రెడ్డి ఈ కథను కొత్తగా తెరకెక్కించారు. ఒక మాజీ రేసర్ తన దేశంలో రేసింగ్ క్రీడకు గుర్తింపు తీసుకురావాలని కృషి చేస్తాడు. అతని కుమారుడు మంచి రేసర్‌గా ఎదుగుతాడు కానీ కొన్ని కారణాల వల్ల రేసింగ్‌ను వదిలేస్తాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది.
బైకర్ చిత్రం వచ్చే నెల 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ సినిమా హిందీలో వేరే పేరుతో విడుదల అవుతుంది. తండ్రి కొడుకుల భావోద్వేగ కథతో పాటు రేసింగ్ ప్రపంచంలోని సవాళ్లను ఈ చిత్రం చూపిస్తుంది.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!