
టెక్నాలజీ

తిరుపతి పట్టణానికి సమీపంలోని శేషాచలం అడవుల్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. మంటలు మరింత విస్తరించకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, అగ్నిని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. శనివారం బయోట్రిమ్ వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ మంటలు చెలరేగినట్లు సమాచారం.
ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే పీసీసీఎఫ్ నుంచి వివరణ కోరడంతో పాటు అటవీ శాఖ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. వేగవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!