
టెక్నాలజీ

ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 133వ ఎపిసోడ్లో దేశ ప్రజలను ఉద్దేశించి జనగణన 2027లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈసారి జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు.
సిబ్బంది మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేస్తారని, అలాగే ప్రజలకు స్వీయ గణన సదుపాయం కూడా కల్పించామని చెప్పారు. ప్రజలు ముందుగానే తమ వివరాలను నమోదు చేసుకుని ప్రత్యేక ఐడీని సిబ్బందికి చూపించవచ్చని తెలిపారు. జనగణన కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాకుండా అందరి బాధ్యత అని, అందులో ఇచ్చే సమాచారం పూర్తిగా సురక్షితంగా, గోప్యంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!