

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విలీన ప్రక్రియను ఈ రోజు రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ఆమోదించారు. దీంతో రాజ్యసభ అధికారిక వెబ్సైట్ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సంఖ్య 10 నుంచి 3కు తగ్గింది. మరోవైపు బీజేపీ సభ్యుల సంఖ్య 106 నుంచి 113కు పెరిగింది. ఎన్డీఏ బలం కూడా 141 నుంచి 148కు చేరడంతో రాజ్యసభలో మెజారిటీ మార్క్ అయిన 123 స్థానాల వైపు బీజేపీ మరింత దగ్గరైంది.
బీజేపీలో చేరినట్లు ఆప్ ఎంపీలు సమర్పించిన విలీన లేఖపై రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ న్యాయపరమైన అభిప్రాయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తం ఏడుగురు ఎంపీలు ఆ లేఖపై సంతకం చేసినట్లు తెలిసింది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం రెండు మూడొంతుల మెజారిటీ ఉంటే విలీనాన్ని ఆమోదించవచ్చని చైర్మన్ భావించినట్లు తెలుస్తోంది. ఆప్ తరపున రాఘవ్ చద్దా, సందీప్ పాఠక్, స్వాతి మాలివాల్, హర్భజన్ సింగ్, విక్రమ్‌జీత్ సాహ్నే, అశోక్ మిట్టల్, రాజేందర్ గుప్తా బీజేపీలో చేరారు. మరోవైపు ఈ ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ చైర్మన్‌ను కోరిన విషయం కూడా తెలిసిందే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!