

భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు కొత్త హైకమిషనర్‌గా మాజీ కేంద్ర మంత్రి దినేశ్ త్రివేదిని నియమించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం యూరోపియన్ యూనియన్‌కు రాయబారిగా వెళ్లనున్న ప్రణయ్ వర్మ స్థానంలో త్రివేది బాధ్యతలు స్వీకరించనున్నారు. త్వరలోనే ఆయన కొత్త పదవిని చేపట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఇటీవల భారత్-బంగ్లాదేశ్ మధ్య కొన్ని ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
దినేశ్ త్రివేది రాజకీయంగా విశేష అనుభవం కలిగిన నేత. 1980లలో కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన, తరువాత జనతా దళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీల్లో కొనసాగి 2021లో భాజపాలో చేరారు. కేంద్రంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రిగా సేవలందించడంతో పాటు రైల్వే మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కూడా సభ్యునిగా కీలక పాత్ర పోషించారు.


.jpg&w=3840&q=75)





.webp&w=3840&q=75)




.jpeg&w=3840&q=75)







కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!