
రాజకీయాలు

డిప్యూటీ సీఎం నియోజకవర్గమైన పిఠాపురంలో రాజకీయ ఉద్రిక్తత మరోసారి పెరిగింది. జనసేన, టీడీపీ వర్గాల మధ్య వివాదం చోటు చేసుకోవడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ ఘటనతో ప్రాంతంలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
“పిచ్చి వేషాలు వద్దు” అంటూ జనసేన నేత దొరబాబు వర్మపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడంపై వర్మ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జిల్లా జనసేన అధ్యక్షుడు తుమ్మలబాబుతో వర్మ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడంతో దొరబాబు జోక్యం చేసుకుని వర్మపైకి దూసుకెళ్లినట్లు సమాచారం.





















.jpg&w=3840&q=75)
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!