

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ జట్టు దారుణంగా కూలిపోయింది. కేవలం 2.4 ఓవర్లలోనే 7 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. తొలి ఓవర్‌లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో సాహిల్ ఔటవడంతో వికెట్ల పతనం ప్రారంభమైంది.
రెండో ఓవర్‌లో హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేఎల్ రాహుల్, సమీర్ రిజ్వీని వరుస బంతుల్లో ఔట్ చేశాడు. మూడో ఓవర్‌లో మళ్లీ భువనేశ్వర్ తన ప్రభావం చూపుతూ స్టబ్స్, అక్షర్ పటేల్ వికెట్లు తీసి దిల్లీని మరింత కష్టాల్లోకి నెట్టాడు. ఈ దశలో భువనేశ్వర్ మూడు వికెట్లు, హేజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు.
పవర్‌ప్లే ముగిసే సరికి దిల్లీ జట్టు 6 ఓవర్లలో 13 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి పూర్తిగా బ్యాక్‌ఫుట్‌లో పడింది. ప్రస్తుతం నితీశ్ రాణా, అభిషేక్ పొరెల్ క్రీజులో ఉండగా జట్టును గట్టెక్కించే బాధ్యత వీరిద్దరిపై పడింది.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!