

శ్రీనివాస్ నారాయణన్, ఓపెన్ఏఐలో బీ2బీ అప్లికేషన్స్ విభాగపు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO)గా ఉన్న ఆయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు సంవత్సరాల పాటు సంస్థలో సేవలందించిన తరువాత భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ప్రయాణాన్ని “అద్భుతమైన అనుభవం”గా అభివర్ణిస్తూ, ముందుగానే సంస్థకు తన నిర్ణయాన్ని తెలియజేశానని వెల్లడించారు.
తదుపరి ప్రణాళికలపై నిర్ణయం తీసుకునే ముందు భారత్‌లో తన వృద్ధ తల్లిదండ్రులతో కొంత సమయం గడపాలని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సామ్ ఆల్ట్‌మన్, గ్రెగ్ బ్రాక్‌మన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి అయిన నారాయణన్, విస్కాన్సిన్–మాడిసన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ పూర్తి చేసి, ఐబిఎం అల్మాడెన్ రీసెర్చ్ సెంటర్లో తన కెరీర్‌ను ప్రారంభించారు. అనంతరం మెటాలో దశాబ్దం పాటు పని చేసి, ఫేస్‌బుక్ ఫోటోస్ వంటి ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. ఓపెన్ఏఐలో అప్లైడ్ ఇంజనీరింగ్ బృందాన్ని నిర్మించి, పరిశోధనను కోట్లాది మంది ఉపయోగించే ఉత్పత్తులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించారు.






.webp&w=3840&q=75)











.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!