
క్రీడలు

హైదరాబాద్ పరిసర ప్రాంతమైన శంకర్‌పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక నిర్మాణ సంస్థ ప్రాంగణంలో భారీ క్రేన్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో పది మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. భారీ ఈదురుగాలుల కారణంగా క్రేన్ అదుపుతప్పి కిందపడినట్లు ప్రాథమిక సమాచారం.
గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలంలో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.


















.jpeg&w=3840&q=75)



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!