

సోషల్ అంశాలతో రూపొందిన నుక్కడ్ నాటక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తన్మయ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 24న, అంటే రేపటి నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో మోల్ శ్రీ, శివంగ్ రాజ్ పాల్, నిర్మల హజ్రా, డానిష్ హుస్సేన్ ముఖ్య పాత్రల్లో నటించారు. కాలేజీ క్యాంటీన్‌లో దొంగతనం చేస్తూ పట్టుబడిన ఇద్దరు విద్యార్థులను బహిష్కరిస్తారు. తిరిగి కాలేజీలో చేరేందుకు వారికి ఒక బస్తీలోని ఐదుగురు పిల్లలకు చదువు చెప్పే బాధ్యత ఇస్తారు.
ఆ తర్వాత ఈ ఇద్దరు విద్యార్థులు ఆ బాధ్యతను పూర్తి చేసి మళ్లీ కాలేజీలో చేరగలిగారా లేదా అన్నదే మిగతా కథ. సాధారణమైన కథ అయినప్పటికీ సామాజిక సందేశాన్ని అందిస్తూ ఈ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేస్తుంది.


.png&w=3840&q=75)
.jpeg&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!