
న్యూస్

బెట్టింగ్ యాప్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు సెలబ్రిటీలకు సంబంధించిన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. తాజాగా అటాచ్ చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.7.93 కోట్లుగా అధికారులు వెల్లడించారు.
ఈడీ అటాచ్ చేసిన ఆస్తులు నటుడు సోనూసూద్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, అలాగే నటీమణులు నేహా శర్మ, ఊర్వశి రౌతేలా, మిమికి సంబంధించినవిగా అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం రూ.19.7 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసినట్లు సమాచారం కాగా, దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!