

అంబటి అర్జున్, రమేష్ ఇందిర, స్నేహల్ కామత్ తదితరులు నటించిన పోచమ్మ వెబ్ సిరీస్ ఈ రోజు నుంచి ఆహాలో తెలుగు, తమిళ భాషల్లో ప్రసారం కానుంది. ఈ సిరీస్‌ను శ్రుతి నాయుడు నిర్మించగా, రమేష్ ఇందిర దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు నిన్న ప్రత్యేక ప్రదర్శన నిర్వహించి, చిత్ర బృందం తమ అభిప్రాయాలను పంచుకుంది.
ఈ సందర్భంగా అంబటి అర్జున్ మాట్లాడుతూ కొన్ని కథలు మొదట నిశ్శబ్దంగా ఉంటాయని, కానీ విడుదల తర్వాత మంచి ప్రభావం చూపిస్తాయని అన్నారు. పోచమ్మ కూడా అలాంటి సిరీస్ అని చెప్పారు. టైటిల్, పోస్టర్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిందని, చిత్రీకరణ, సంగీతం చాలా బాగా వచ్చాయని తెలిపారు. పెద్దగా హడావుడి లేకుండానే ఈ సిరీస్ విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. స్నేహల్ కామత్ మాట్లాడుతూ జెస్సీ పాత్రలో నటించడం మంచి అనుభవమని, చిత్రీకరణ సమయంలో అందరితో కలిసి పని చేయడం ఆనందంగా అనిపించిందని చెప్పారు.
శ్రీ పూజ మాట్లాడుతూ మొదటి రోజు నుంచే ఈ సిరీస్ విజయం సాధిస్తుందని నమ్మకం కలిగిందని తెలిపారు. బృందంలోని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని చెప్పారు. ఆహా సంస్థ ప్రతినిధి కవిత మాట్లాడుతూ కథ విన్నప్పుడే విజయం మీద నమ్మకం వచ్చిందని, చిత్రీకరణ సమయంలో ఆధ్యాత్మిక అనుభూతి కలిగిందని అన్నారు. ఈ సిరీస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని తెలిపారు.




.webp&w=3840&q=75)








.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!