

‘‘మంచి సినిమాలు రావాలంటే తప్పకుండా రిస్క్ తీసుకోవాలి. అదే సినిమాకు ప్రత్యేకతను తీసుకువస్తుంది’’ అంటూ డెకాయిట్ చిత్ర దర్శకుడు తెలిపారు. ప్రస్తుతం ప్రేమ కథలు, డ్రామాలు తెలుగులో తగ్గిపోతున్నాయని భావించి, ఆ లోటును పూడ్చాలనే ఉద్దేశంతో ఈ సినిమాను రూపొందించినట్లు చెప్పారు. మహిళలు, జెన్ జీ ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుండటంతో మంచి స్పందన వస్తోందని తెలిపారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కించిన ఈ సినిమాకు అక్కడ కూడా మంచి ఆదరణ లభిస్తోందని వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ, ‘‘డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే అందం. ఇప్పుడు దాని గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది’’ అని పేర్కొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నిర్మితమైన ఈ చిత్రంలో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించగా, షానియల్ డియో దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోవడంతో హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది. కొత్తవాళ్లతో పని చేయడం సవాల్ అయినప్పటికీ, టీమ్ కృషితో అనుకున్న సమయానికి సినిమా పూర్తి చేశామని దర్శకుడు తెలిపారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!