
గాసిప్స్

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్‌పై ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేట్ మెసేజ్‌లు పంపాడంటూ బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీ ఆరోపణలు చేయడంతో ఈ వివాదం చర్చనీయాంశమైంది. “క్యూట్‌గా ఉన్నావు” అంటూ చాహల్ తనకు మెసేజ్ చేసినట్టు తాన్య స్క్రీన్‌షాట్‌ను బయటపెట్టింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ కావడంతో నెటిజన్లు చాహల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో చాహల్ ఆమెపై పరువు నష్టం దావా వేసినట్టు సమాచారం.
ఈ విషయంపై స్పందించిన తాన్యా, తననే ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పరువు దెబ్బతిన్నప్పటికీ తనపై కేసు వేయడం అన్యాయమని పేర్కొంది. చాహల్‌ను ఎవరూ ప్రశ్నించకపోవడం ఎందుకని ఆమె ప్రశ్నించింది. తాను అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశం లేదని, తనకు చాహల్‌పై గౌరవం ఉందని స్పష్టం చేసింది. ఈ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!