
న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ జిమ్ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా కోసం ఆయన పవర్ఫుల్ V-షేప్ ఫిజిక్‌పై కసరత్తులు చేస్తున్నారు. బ్యాక్ డబుల్ బైసెప్స్ పోజ్‌లో కనిపించిన ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా పూర్తిగా కలర్ఫుల్గా ఉండనుందని సమాచారం. గతంలో ప్రశాంత్ నీల్ సినిమాల్లో కనిపించిన డార్క్ అండ్ గ్రే షేడ్స్‌కు భిన్నంగా ఈ చిత్రం ఉండనుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 25 న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!