
న్యూస్

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బొలెరో వాహనం ట్యాంకర్‌ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఆ వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారని సమాచారం. వీరు మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తదుపరి చర్యలు చేపడుతున్నారు.













.png&w=3840&q=75)








కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!