
గాసిప్స్

భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తనకు వచ్చిన ‘సర్పంచ్’ అనే నిక్నేమ్పై స్పందించాడు. పంజాబ్ కింగ్స్‌లో చేరిన తర్వాత తనను సర్పంచ్ అని పిలుస్తున్నారని, మొదట దాని అర్థం ఏమిటో కూడా తెలియదని చెప్పాడు. ఈ పేరు జట్టులోనే కాకుండా అభిమానుల్లో కూడా చర్చనీయాంశమైంది.
తరువాత తన సహచరులు సర్పంచ్ అంటే కుటుంబం, గ్రూప్ లేదా ఊరికి నాయకుడు అని అర్థమని చెప్పారని అయ్యర్ వెల్లడించాడు. ఈ బిరుదు తనకు చాలా నచ్చిందని, గర్వంగా స్వీకరిస్తున్నానని తెలిపాడు. మరోవైపు పంజాబ్ జట్టు కూడా ‘సర్పంచ్ సాబ్’ అంటూ అయ్యర్‌ను హైలైట్ చేస్తోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!