

రాష్ట్ర బీజేపీలో ఆధిపత్య పోరు రోజు రోజుకూ ముదురుతోంది. సొంత పార్టీ నాయకులపైనే ఆరోపణలు చేస్తూ ఢిల్లీకి ఫిర్యాదులు పంపుతున్న నేపథ్యంలో కేడర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నది. పాత, కొత్త, సీనియర్, జూనియర్ అనే విభజనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీని బలోపేతం చేయాల్సిన సమయంలో నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తోంది. రాష్ట్రంలో పార్టీకి గణనీయమైన ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ, విపక్ష పాత్రను సమర్థంగా పోషించడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక నాయకులు పరస్పరం ఆరోపణలు, ఫిర్యాదులతో పార్టీ ప్రతిష్ఠను దెబ్బ తీస్తున్నారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. వ్యక్తిగత ప్రాధాన్యత కోసం కొందరు ఇతర నాయకులపై వివాదాస్పద అంశాలను అధిష్ఠానానికి తెలియజేస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీపై పోరాటం చేయాల్సిన సమయంలో సొంత పార్టీ నేతల మధ్యే విభేదాలు పెరగడం కేడర్‌లో నిరాశ కలిగిస్తోంది. ఈ పరిస్థితి కొనసాగితే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని, నాయకత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!